Changure Bangaru Raja | ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే.. మరోవైపు హోంబ్యానర్ ఆర్టీ టీమ్‌వర్క్స్ పతాకంపై ఫన్ అందించే సినిమాలను తెరకెక్కిస్తున్నాడు రవితేజ. తాజాగా ఈ బ్యానర్లో వస్తున్న సినిమా ‘ఛాంగురే బంగారురాజా’ (Changure Bangaru Raja). కార్తీక్ రత్నం (Karthik Rathnam) హీరోగా నటిస్తుండగా.. కుషిత కల్లపు హీరోయిన్గా నటిస్తోంది. సెప్టెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ-కార్తీక్ రత్నం టీం వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసింది.
కమెడియన్ సత్య, కార్తీక్ రత్నం, అజయ్, రవిబాబు.. ఈ నలుగురి ట్రాక్‌తో ఓ వైపు కామెడీ, మరోవైపు సీరియస్ ట్రాక్ ఉండబోతున్నట్టు స్టిల్స్‌తో అర్థమవుతోంది. ఈ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ (Changure Bangaru Raja teaser)ను విడుదల చేశారు. గుడ్ మార్నింగ్.. నాకు ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. సడెన్‌గా ముగ్గురు దొంగనా కొడుకులు నా జీవితంలోకి ఎంటరైపోయి సుఖంగా ఉన్న నా జీవితాన్ని కలగాపులగం చేసేశారు… అంటూ సునీల్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్న టీజర్ కొంచెం ఫన్‌గా, కొంచెం సీరియస్‌గా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం సతీష్ వర్మ. బంగార్రాజు, తాతారావు, గాటిల్ల చుట్టూ సినిమా సాగనున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ మూవీకి కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నాడు. జనార్దన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండగా.. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. సత్య అక్కల, రవిబాబు, ఎస్తేర్ నొరోన్హా, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వర్కింగ్ స్టిల్స్..
No heat, sweat & light can stop Bangarraju in action 😎
Here’re some exclusive working stills from #ChangureBangaruRaja 📸🤗
In Theaters From SEPTEMBER 15th ❤️🔥#CBROnSEP15th 💥@RaviTeja_offl @KarthikRathnam3 @GoldieNissy @msvarma1 #Satya #RaviBabu @UrsNityasri… pic.twitter.com/imgpZOll8Z
— RT Team Works (@RTTeamWorks) September 12, 2023
ఛాంగురే బంగారు రాజా టీజర్..
Frames to cherish forever for the Young Team😍
Here’re the Snaps from #ChangureBangaruRaja Teaser Launch by Mass Maharaja @RaviTeja_offl♥️
– https://t.co/qHCIiEDQfS@KarthikRathnam3 @msvarma1 @GoldieNissy #Satya #Ravibabu @rajtirandasu @UrsNityasri @RTTeamWorks @fbf_pictures… pic.twitter.com/4h5D3UJl1p
— RT Team Works (@RTTeamWorks) April 26, 2023