Chandu Champion | కార్తీక్ ఆర్యన్(Karthik Aryan).. బాలీవుడ్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. పుష్కర కాలం కిందట ‘ప్యార్ కా పంచునామా’ అనే సినిమాతో హిందీనాట తెరంగ్రేటం చేసి, తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘లుకా చుప్పి’, ‘పతి ఔర్ పత్నీ వో’, ‘సత్యప్రేమ్ కి కథ’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల బొమ్మలతో ఏకంగా స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లాడు. ఇక ఈ కుర్ర హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ‘చందూ ఛాంపియన్’(Chandu Champion). బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్(Ek Tha Tiger) చిత్రాల ఫేమ్ కబీర్‌ఖాన్ (Kabhir khan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనితో సెట్లో ఉన్న ఒక ఫొటోను కూడా పంచుకుంది.
KARTIK AARYAN – KABIR KHAN – SAJID NADIADWALA: ‘CHANDU CHAMPION’ FILMING ENDS… It’s a wrap for #ChanduChampion, jointly produced by #SajidNadiadwala and #KabirKhan… The #KabirKhan directorial stars #KartikAaryan in title role… 14 June 2024 release. pic.twitter.com/AboCK4ZAOr
— taran adarsh (@taran_adarsh) February 2, 2024
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. భారతదేశం నుండి మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.