Chandu Champion | బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘చందు ఛాంపియన్’ (Chandu Champion). బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ (Ek Tha Tiger) లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన కబీర్‌ఖాన్ (Kabhir khan) దర్శకత్వం వహించాడు. భారతదేశ మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేత ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తోపాటు ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. కాగా ఈ సినిమా జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కార్తీక్ ఆర్యన్ టీం. కాగా మురళీకాంత్ పేట్కర్తో కలిసి ముంబైలో ఫస్ట్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌లో సినిమాకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకులు చప్పట్లతో టీం మెంబర్స్‌ను విష్ చేస్తున్న విజువల్స్ వీడియోను షేర్ చేశాడు కార్తీక్ ఆర్యన్. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని కబీర్ ఖాన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాను నడియాద్వారా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తుంచారు.
First screening of Chandu Champion with the Man himself🙏
An evening filled with honor, joy and tears with THE REAL CHAMPION❤️
The Man Who Refused To Surrender, MR MURLIKANT PETKAR 🙏#ChanduChampion 2 Days to Go 🇮🇳👊🏻#KabirKhan #SajidNadiadwala
@ipritamofficial @sudeepdop… pic.twitter.com/XMuBkSqqde— Kartik Aaryan (@TheAaryanKartik) June 12, 2024
చందు ఛాంపియన్ ట్రైలర్..