Karthik Aaryan | ఈ మధ్య బాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కార్తిక్ ఆర్యన్. పుష్కర కాలం కిందట ‘ప్యార్ కా పంచుమా’ అనే సినిమాతో హిందీనాట తెరంగ్రేటం చేసి, తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత హిట్ అనే మాట వినడానికి ఆయనకు ఆరేళ్లు పట్టింది. ఆరేళ్లలో ఐదు డిజాస్టర్ సినిమాలు చేశాడు. మళ్లీ 2017లో ‘సోను కే టిట్లు కీ స్వీటీ’ అనే రోమ్ కామ్‌తో కంబ్యాక్ చేశాడు. కంబ్యాక్ అంటే మళ్లీ ఆశా మాశీ కంబ్యాక్ కాదు. కొడితే ఏకంగా నూటాయాభై కోట్ల రేంజ్లో వసూళ్లు కొల్లగొట్టి బాలీవుడ్ నాట సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ‘లుకా చుప్పి’, ‘పతి ఔర్ పత్నీ వో’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల బొమ్మలతో ఏకంగా స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లాడు.
కరోనాతో కష్ట కాలంలో పడిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీకి భూల్ భూలయ్య-2తో ఊపిరి పోశాడు. వంద కోట్లు కొల్లగొట్టడమే కష్టంగా ఉన్న రోజుల్లో రూ.250 కోట్ల మార్క్‌ను టచ్ చేసి తిరుగులేని విజయాన్నందుకున్నాడు. ఇక ఇటీవలే ఆయన నటించిన సత్య ప్రేమ్ కీ కథ రిలీజై మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో కార్తిక్ నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఇక ఇటీవలే ఈ కుర్ర హీరో కబీర్‌ఖాన్ దర్శకత్వంలో చందు చాంపియన్ అనే స్పోర్స్ట్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజైంది.
షార్ట్ హేయిర్ కట్‌తో ఉన్న కార్తిక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపుతుంది. ఈ సినిమా ఓ చాంపియన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ఇప్పటివరకు మేకర్స్ ఆ బయోపిక్ ఎవరనేది క్లారిటీ ఇవ్వలేదు. కాగా భారతదేశపు తొలి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీకాంత్ పేట్కర్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు హిందీ వర్గాల్లో టాక్. 1972లో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. భారత ప్రభుత్వం 2018లో మురళీకాంత్ పేట్కర్‌ను పద్శశ్రీతో సత్కరించింది. ఇక ఆయన బయోపిక్‌నే చందు చాంపియన్ సినిమా అని హిందీ నాట తెగ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.
KARTIK AARYAN – KABIR KHAN – SAJID NADIADWALA: ‘CHANDU CHAMPION’ FIRST LOOK OUT NOW… #FirstLook of #KartikAaryan as #Chandu from #ChanduChampion… Based on the real-life story of a sportsman and his spirit of never giving up.
Directed by #KabirKhan and produced by… pic.twitter.com/UfSHOX7gxd
— taran adarsh (@taran_adarsh) August 1, 2023