అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురంలో హిందీలో రీమేక్ చేస్తున్నారని తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షెహ్జాదా (Shehzada) టైటిల్‌తో వస్తోంది. ఇప్పటికే విడుదలైన షెహ్జాదా టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం షెహ్జాదా ట్రైలర్‌ను (Shehzada Trailer )ను జనవరి 12న లాంఛ్ చేయనున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కృతిసనన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రోహిత్ ధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో పరేశ్ రావల్, మనీషా కొయిరాలా, సచిన్ ఖేడ్కర్, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ & టీ సిరీస్, అల్లు అరవింద్ సమర్పణలో టీ-సిరీస్ ఫిలిమ్స్, అల్లు ఎంటర్టైన్మెంట్, బ్రాట్ ఫిలిమ్స్, హారికాఅండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
షెహ్జాదా టీజర్.. వీడియో