Viruman Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న కార్తి ‘విరుమన్’
Viruman Movie | తమిళ స్టార్ కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుంచి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలయ్యాయి. తెలుగులో ఈయన సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలన్నాయి. అందులో ‘విరుమన్’ ఒకటి. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగ్గజ దర్శకుడు శంకర్ కూతురు అధితి హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.
‘విరుమన్’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. ఇక ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం మూడు వారాలు ముందుగా.. ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కాగా ఇదే రోజున విక్రమ్ నటించిన ‘కోబ్రా’ విడుదల కావాల్సి ఉంది. కానీ సీజి వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో కోబ్రా పోస్ట్ పోన్ కానుంది. దాంతో ‘కోబ్రా’ డేట్ను ‘విరుమన్’ రిప్లేస్ చేస్తుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
Certified U/A.#Karthi 's #Viruman is all set to hit the screens soon 🔥 Aug 11 calling! pic.twitter.com/LeRI3zizMB
— Kaushik LM (@LMKMovieManiac) July 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

