Japan Review | కార్తీ జపాన్ సినిమా హిట్టా.. ఫట్టా?
హీరో కార్తీ (Karthiకి బాగా కలిసొచ్చిన సీజన్ దీపావళి. జపాన్‌గా కార్తి గెటప్, ప్రత్యేకమైన డైలాగ్ డిక్షన్, హీస్ట్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇవన్నీ అంచనాలని పెంచాయి. కార్తి కెరీర్ లో 25 మైల్ స్టోన్ మూవీగా వచ్చిన జపాన్ ఎలాంటి వినోదాల్ని పంచిందో తెలుసుకోవడానికి రివ్యూలోకి వెళ్దాం.
Japan Review | హీరో కార్తీ (Karthi) కి బాగా కలిసొచ్చిన సీజన్ దీపావళి. గత ఏడాది దీపావళికి ‘సర్దార్’ తో విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ‘జపాన్’ (Japan)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్ ట్రైలర్ జపాన్ పై ఆసక్తిని పెంచాయి. జపాన్ గా కార్తి గెటప్, ప్రత్యేకమైన డైలాగ్ డిక్షన్, హీస్ట్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇవన్నీ అంచనాలని పెంచాయి. మరా అంచనాలని జపాన్ అందుకున్నాడా ? దీపావళితో మరో విజయం సొంతం చేసుకున్నాడా? కార్తి కెరీర్ లో 25 మైల్ స్టోన్ మూవీగా వచ్చిన జపాన్ ఎలాంటి వినోదాల్ని పంచిందో తెలుసుకోవడానికి రివ్యూలోకి వెళ్దాం.
కథ గురించి:
నగరంలో రాయల్ జ్యువెలరీ షాప్ లో రూ. 200 కోట్ల విలువలైన బంగారు ఆభరణాలు దోపిడీకి గురౌతాయి. ఈ కేసుని చేధించడానికి పోలీస్ అధికారులు శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) రంగంలోకి దిగుతారు. శ్రీధర్.. బంగారు రజను జెల్లడపట్టే కూలీ జీవితం గడుపుతున్న రాధ అనే అమాయకుడిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు. భవాని… ఈ దొంగతనం వెనుక వున్నది జపాన్( కార్తి) అని నిర్ధారిస్తాడు. మరోవైపు జపాన్ ని పట్టుకోవడానికి కేరళ, కర్ణాటక పోలీసులు కూడా గాలిస్తుంటారు. అసలు ఈ జపాన్ ఎవరు? దొంగతనంలో అంత ఫేమస్ ఎలా అయ్యాడు ? రాధ, జపాన్ మధ్య ఏదైనా రిలేషన్ వుందా ? జపాన్ కథలో హీరోయిన్ సంజ (అనూ ఇమ్మాన్యుయేల్) పాత్ర ఏమిటి ? చివరికి దోపిడీ దొంగ దొరికాడా లేదా ? అనేది తక్కిన కథ.
కథా విశ్లేషణ:
జపాన్ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. జపాన్ పాత్రతో పాటు ప్రయానించగలిగితే.. ఆ ప్రయాణం ప్రేక్షకులకు వినోదాల్ని పంచుతుంది. నగలదోపిడీ సన్నివేశంతో ఈ కథని ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. తర్వాత గోల్డెన్ స్టార్ గా జపాన్ ఎంట్రీ., మాస్ కమర్షియల్ స్టయిల్ లో తీసిన ఓ సినిమాటిక్ ఫైటింగ్ సీన్ మంచి వినోదాన్ని పంచుతుంది. తర్వాత డాక్టర్, జపాన్ ఆరోగ్యం గురించి చెప్పడం, జపాన్ గ్యాంగ్ తో స్మశానంతో చేసే ఫైట్ సీక్వెన్స్ ఆసక్తికరంగా వుంటుంది.
మరోవైపు రాధ కథని నడిపారు. అది ఎమోషనల్ గా వుంటుంది. అయితే దొంగా పోలీస్ గేమ్ ఇంకాస్త ఆసక్తిగా తీర్చిదిద్దాల్సింది. అలాగే హీరోయిన్ సంజు పాత్రని కూడా స్పష్టతతో బలంగా డిజైన్ చేయాల్సిందనిపించింది. ఇంటర్వెల్ బాంగ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి పోస్టర్ చుట్టూ నడిపే సీన్స్ ఆసక్తిగానే వుంటాయి. ప్రీక్లైమాక్స్ కి ముందు వచ్చే తాటిబాంబుల ఫైట్ సీన్ యాక్షన్ ప్రియులని అలరిస్తుంది. జపాన్ కథకు మంచి ముగింపు రాసుకున్నాడు దర్శకుడు. రాధ, జపాన్ పాత్రలకు ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది.
నటీనటుల నటన:
జపాన్ పాత్రలో కార్తి పరకాయ ప్రవేశం చేశాడు. జపాన్ గా కొత్తగా కనిపిస్తాడు, తన నటన, డైలాగులు సహజంగా కొత్తగా కుదిరాయి. యాక్షన్ సీన్స్ లో తన యీజ్ చూపించాడు. జపాన్ మాటలు నవ్విస్తాయి. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర బలంగా ఉండాల్సింది. సునీల్ కు మరో కీలక పాత్ర దక్కింది. ఇలాంటి పాత్ర చేయడం సునీల్ కొత్త. చాలా సహజంగా నటించారు. అలాగే భవాని పాత్రలో చేసిన విజయ్ కూడా ఆకట్టుకుంటారు. రాధగా చేసిన నటుడు కూడా మెప్పిస్తాడు. కేస్ రవి కుమార్ తో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ గా:
జపాన్ సాంకేతికంగా మంచి పనితీరు కనబరిచింది. జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన టచ్చింగ్ పాట మాస్ ని ఆకట్టుకుంటే చక్రాలాంటి పాట ఎమోషనల్ గా వుంది. బీజీఎం కూడా బావుంది. కెమరాపనితం టాప్ క్లాస్ లో వుంది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా వుండాల్సింది. నిర్మాతలు కథకు కావాల్సింది సమకూర్చారు. దర్శకుడు రాసుకున్న మాటలు కొన్ని ఆకట్టుకున్నాయి. ఒక యునిక్ క్యారెక్టర్ తో వినోదంతో పాటు అంతర్లీనంగాలోతైన సందేశం ఇవ్వాలని ప్రయత్నించాడు దర్శకుడు. ఈ ప్రయత్నం చాలా చోట్ల మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
కార్తి, జపాన్ క్యారెక్టర్
వినోదం, క్లైమాక్స్, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
కథనంలో వేగం తగ్గడం,
కొన్ని బలహీనమైన పాత్రలు
రేటింగ్ : 2.5/5
జపాన్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Karthi 1

Karthi 2

Karthi 3

Karthi 4

Karthi 5
జపాన్ తెలుగు థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అక్కినేని నాగార్జున హోంబ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది. జపాన్ మూవీలో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
జపాన్ వర్కింగ్ స్టిల్స్..
#Japan New Stills..💥 Grand Audio Launch loading for this #Karthi‘s 25th Film..⭐ pic.twitter.com/YLRNBUFMiN
— Laxmi Kanth (@iammoviebuff007) October 25, 2023
#Japan Telugu Theatrical Rights bagged by the prestigious @AnnapurnaStdios ❤️🔥
Exploding this Diwali 💥
ICYM the #JapanTeaser
– https://t.co/dGkgNHAhRZ@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/hIQgbEYA5j— Annapurna Studios (@AnnapurnaStdios) October 21, 2023
Touching Touching వీడియో సాంగ్..
జపాన్ టీజర్..
Get ready to meet the Pan India thief! Unmasking the enigmatic world of #Japan💥#JapanTeaser
Tamil : https://t.co/fXwdG7DTwT
Telugu : https://t.co/uu3mVE0BHi@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/aQT5ZYXk1Q— BA Raju’s Team (@baraju_SuperHit) October 18, 2023
జపాన్ ఇంట్రడక్షన్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

