Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
Transport Department | కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవం తెలంగాణ రవాణా శాఖ , అవినీతి నిరోధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో సత్యనిష్ఠతో సమృద్ధి అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
హైదరాబాద్ : కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) పిలుపు మేరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవం తెలంగాణ రవాణా శాఖ (Transport Department) , అవినీతి నిరోధక శాఖ( ACB ) సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో సత్యనిష్ఠతో సమృద్ధి అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ఎం. చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకట రమణ మాట్లాడుతూ, ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న రవాణా శాఖలో ప్రతి ఉద్యోగి జవాబుదారీతనంతో, సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పౌరులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రవాణా శాఖ అనేక సంస్కరణలు చేపట్టిందని వివరించారు. ఈ చర్యల ద్వారా రవాణా శాఖలో నివారణాత్మక విజిలెన్స్‌ను బలోపేతం చేస్తున్నామని, పౌరులు కూడా దళారులను ఆశ్రయించకుండా ఆన్లైన్ సేవలను నేరుగా వినియోగించుకోవాలని వారు కోరారు.
ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, చలపతి, రాజేష్ మాట్లాడుతూ, అవినీతిని రూపుమాపడం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రతి పౌరుడి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ చట్టరీత్యా నేరాలేనని స్పష్టం చేశారు. తప్పు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, తప్పు జరగకుండా ముందే అడ్డుకునే నివారణాత్మక విజిలెన్స్ ముఖ్యమని, ఇందుకు ఉద్యోగుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
తుంగతుర్తిలో ప్రమాదకరంగా డ్రైనేజ్ పైపులు
Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

