MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సంబంధిత అధికారులను ఆదేశించారు.
కోరుట్ల : గోదావరి పుష్కరాల (Godavari Pushkaram ) ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ( MLA Dr. Sanjay) సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాబోయే గోదావరి పుష్కరాలకు సమయం తక్కువగా ఉన్నందున, పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.ముఖ్యంగా గోదావరికి అనుసంధానమయ్యే రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల పరిధిలో చేపట్టాల్సిన రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మల్లాపూర్ మండలంలోని బ్రెయిన్పట్నం ప్రాంతం గోదావరి బేసిన్ పరిధిలో ఉన్నందున, ఈ ప్రాంతంలో పుష్కర ఘాట్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
తుంగతుర్తిలో ప్రమాదకరంగా డ్రైనేజ్ పైపులు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

