Sathyam Sundaram | సత్యం సుందరం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందర్భంగా తమిళ నటుడు కార్తీ విజయవాడలో నేడు సందడి చేశారు. ఈ మూవీ సాధించిన విజయం పట్ల కార్తీ, దర్శకుడు ప్రేమ్ కుమార్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అయితే దర్శనం అనంతరం మీడియాతో ముచ్చటించాడు కార్తీ.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదట ఈ సినిమాను నేను తెలుగులో రిలీజ్ చేస్తామంటే వద్దు అన్నాను. ఒక ఫైట్ లేదు, సాంగ్స్ లేవు, డ్యాన్స్ లేవు అని చెప్పాను. అప్పుడు మా టీం మాట్లాడుతూ.. లేదు ఇది చాలా మంచి మూవీ ఆడుతుంది అన్నారు. ఇది చూసినప్పుడు తెలుగులో కే విశ్వనాథ్ గారి మూవీ లాగా ఉందని చెప్పారు. అలాగే ఇది పెద్దవాళ్లకి కాకుండా యూత్‌కి కూడా బాగా నచ్చుతుంది. చాలారోజుల తర్వాత ఇలాంటి సినిమాను చూస్తున్నాం అని చెబుతున్నారు. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ తెలిపాడు. నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు సర్దార్ 2 తో పాటు ఖైదీ 2 ఉన్నాయి అంటూ కార్తీ చెప్పుకోచ్చాడు.