‘ఊపిరి’ తర్వాత కార్తి నేరుగా తెలుగులో నటించలేదు. ‘హిట్ 3’ ైక్లెమాక్స్లో ‘హిట్ 4’లో కథానాయకుడిగా నటించనున్నట్టు రివీల్ చేశారు. మరి ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సివుంది. ఈ లోగా ఓ తెలుగు సినిమాకు కార్తి ఓకే చెప్పారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా గురువారం హైదరాబాద్లో జరిగాయి. ‘మ్యాడ్’ఫేం కల్యాణ్శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
మీనాక్షి చౌదరి కథానాయిక. కామెడీ పండించడంలో కార్తీ సిద్ధహస్తుడు. కామెడీ రాయడంలో, తీయడంలో కల్యాణ్శంకర్ సమర్ధుడు. ఈ ఇద్దరూ కలిస్తే ఇక వినోదానికి ఢోకా ఉండదని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. క్లీన్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నది. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.