బాలీవుడ్లో కరీనాకపూర్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సంబంధించిన ఏ చిన్నవిషయమైనా ఫ్యాన్స్‌కు ఆసక్తే. స్క్రీన్‌పై కరీనాకపూర్ నటన, ఆమె ఫ్యామిలీ ఫొటోలు ఇలా ఏవైనా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్‌గా వీక్షిస్తుంటారు. కాగా, కరీనాకపూర్ తన కొడుకు జెహాలీఖాన్తో కారు దిగి నడుచుకుంటూ వస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోయలో.. కరీనా తన షూట్‌కి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. తన కొడుకు జెహ్‌తో కలిసి కారు దిగింది. అనంతరం కరీనాకపూర్ చేయి పట్టుకొని జెహ్ బుడిబుడి అడుగులు వేశాడు. బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో జేహ్ నడుస్తుంటే ఫ్యాన్స్ చూసి మురిసిపోయారు.