e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తాను ప‌డ్డ బాధ‌ల‌ని వివ‌రించిన క‌రీనా

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తాను ప‌డ్డ బాధ‌ల‌ని వివ‌రించిన క‌రీనా

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తాను ప‌డ్డ బాధ‌ల‌ని వివ‌రించిన క‌రీనా

బాలీవుడ్ బెబో క‌రీనా క‌పూర్ ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్‌కు ఆమె ‘కరీనా కపూర్‌ ఖాన్స్‌ ప్రగ్నెన్సీ బైబిల్‌’ అనే టైటిల్ పెట్ట‌గా, ఇందులో తను గర్భవతిగా ఉన్నప్పుడు భౌతికంగా, మానసికంగా ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొందో వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యింది.

కరీనా, సైఫ్ దంప‌తుల‌కు ఇప్ప‌టికే తైమూర్ అనే నాలుగేళ్ల బాలుడు ఉండ‌గా, ఇటీవ‌ల జెహ్ అనే కుమారుడు జ‌న్మించాడు. జెహ్ త‌న క‌డుపులో ఉన్న‌ప్పుడు ఎలాంటి ఇబ్బందులు ప‌డిందో ప్ర‌గ్నెన్సీ బైబిల్‌లో వివ‌రించింది. సాధార‌ణంగా సెల‌బ్రిటీల ప్రగ్నెన్సీ అంటే చాలా సింపుల్ అని అనుకుంటారు. కాని ఆ స‌మ‌యంలో చాలా బ‌రువు పెరిగాను, మ‌చ్చ‌లు వ‌చ్చాయి. ఒక‌సారి షూట్‌లో క‌ళ్లు కూడా తిరిగాయి. ఈ బుక్ ద్వారా నేను అన్ని నిజాలే చెప్ప‌ద‌ల‌చుకున్నాను అని క‌రీనా పేర్కొంది.

- Advertisement -

తైమూర్ మాదిరిగానే జెహ్ విష‌యంలోను ప్రైవ‌సీని మెయింటైన్ చేస్తున్నారు క‌రీనా దంప‌తులు. అయితే తాజాగా జెహ్ ఫొటో అంటూ ఓ పిక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది . దీనిపై ప‌టౌడీ ఫ్యామిలీ స్పందించ‌లేదు. కాగా, సైఫ్‌-క‌రీనా దంప‌తుల‌కి 2016 డిసెంబర్‌లో తైమూర్‌ జన్మించగా, సుమారు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత జెహ్‌ పుట్టాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తాను ప‌డ్డ బాధ‌ల‌ని వివ‌రించిన క‌రీనా
ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తాను ప‌డ్డ బాధ‌ల‌ని వివ‌రించిన క‌రీనా
ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తాను ప‌డ్డ బాధ‌ల‌ని వివ‌రించిన క‌రీనా

ట్రెండింగ్‌

Advertisement