Kareena Kapoor Khan, Shahid Kapoor Reunited | బాలీవుడ్ మాజీ ప్రేమికులు షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఖాన్లు ఒక వేదికపై సందడి చేశారు. జైపూర్‌లో జరుగుతున్న ఐఫా వేడుకలో నటులు కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహర్, కృతి సనన్, మధురి దీక్షిత్‌తో పాటు షాహిద్ కపూర్ వచ్చి సందడి చేశారు. అయితే వీరంతా స్టేజ్‌మీద ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన కరీనా అందరిని షాక్‌కి గురి చేసింది. స్టేజ్‌పై ఉన్న బాలీవుడ్ నటులను కలసి హగ్ ఇస్తూ వచ్చిన కరీనా షాహిద్ కపూర్‌ని కూడా హగ్ చేసుకోవడం విశేషం.
ఇక వీరిద్దరు దాదాపు 17 ఏండ్ల తర్వాత కలవడంతో 2007లో వచ్చిన జబ్ వీ మెట్ సినిమాలోని గీత(కరీనా) & ఆదిత్య(షాహిద్) పాత్రలను గుర్తుకుతెచ్చారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు స్టేజ్‌మీద ఉన్నప్పుడు కరీనానే స్వయంగా షాహిద్‌తో మాట్లాడటం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
సైఫ్ అలీఖాన్‌తో పెళ్లికి ముందు కరీనా కపూర్ షాహిద్ కపూర్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2000లో షాహిద్‌తో డేటింగ్లో ఉన్న కరీనా షాహిద్‌తో కలిసి ఫిదా (2004), చుప్ చుప్ కే (2006), జబ్ వీ మెట్ (2007) నటించింది. ఇందులో జబ్ వీ మెట్ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా రెండు నేషనల్ అవార్డులు అందుకుంది. అయితే ఈ సినిమా టైంలోనే షాహిద్‌తో విడిపోయిన కరీనా తషాన్ (2007) సినిమా సమయంలో సైఫ్‌తో ప్రేమలో పడింది. 5 ఏండ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట.. 2012లో పెళ్లి చేసుకున్నారు.
PAST is PAST ~ #ShahidKapoor met #KareenaKapoor Again ♥️pic.twitter.com/bPU7mZv8jJ
— The Filmy Reporter (@FilmyReporter_) March 8, 2025
Omg the nostalgic Geet and Aditya feels that Kareena and Shahid are giving in this video 😭❤️ pic.twitter.com/8aRuO3cg4x
— ✨️ (@daalchaawal_) March 8, 2025