ప్రజ్వల్ దేవ్‌రాజ్ కథానాయకుడిగా రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నడ చిత్రం ‘కరవాలి’. గురుదత్ గనిగ దర్శకత్వం వహిస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంత సంస్కృతి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జంతువు వర్సెస్ మానవుడు’ అన్నది సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి మవీర అనే పోరాటయోధుడి పాత్రలో కనిపించబోతున్నారు.
ఇటీవల ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మనిషి యొక్క మనుగడ, విధేయత అంశాల చుట్టూ అల్లుకున్న కథ ఇదని, కర్ణాటక తీర ప్రాంత ఆచారవ్యవహారాలతో పాటు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుందని మేకర్స్ తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మిత్రా, రమేష్ ఇందిరా, సంపద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సచిన్ బస్రూర్.