Karate Kid: Legends | సినిమా లవర్స్‌కు చైనీస్ మూవీస్ అంటే వెంటనే గుర్తోచ్చే హలీవుడ్ దిగ్గజ నటుడు జాకీచాన్ (Jackie Chan). ప్రపంచ యాక్షన్ ప్రియులతో పాటు కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి మర్చిపోలేని పేరు ఇది. ముఖ్యంగా 90ల నాటి పిల్లలు.. జాకీ సినిమాలు చూస్తూనే పెరిగారంటే అతిశయోక్తి కాదు. బ్రూస్ లీ, తర్వాత చైనా నటులెవరైనా ప్రపంచ ఖ్యాతిని పొందారంటే అది జాకీచాన్ మాత్రమే. అయితే ఈ దిగ్గజ నటుడి సినిమా వచ్చి చాలా ఏండ్లు అవుతున్నా విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మరో క్రేజీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
జాకీచాన్ ప్రధాన పాత్రలో వచ్చిన కరాటే కిడ్ (Karate Kid) ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2010లో వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కొడుకు జాడే స్మిత్ కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు 14 ఏండ్ల అవుతుండగా.. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించాడు జాకీచాన్. కరాటే కిట్ లెజెండ్స్ (Karate Kid Legends) అంటూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం వచ్చే ఏడాది మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.