Devi Sri Prasad | టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని.. ఒపరి ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. రాక్‌స్టార్ డీఎస్పీ ఇటీవల ‘ఓ పరి’ పేరుతో ఇటీవల ప్రైవేట్ వీడియో సాంగ్‌ను కంపోజ్ చేయడమే కాకుండా స్వయంగా ఆలపించాడు. పాన్ ఇండియా స్థాయిలో సంగీత అభిమానులను ఆకట్టుకునేలా వీడియో సాంగ్‌ను కంపోజ్ చేశాడు. ఈ సాంగ్‌లో హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ఐటమ్ సాంగ్‌గా మార్చారంటూ కరాటే కల్యాణితో పాటు హిందూసంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.