Kantara Chapter 1 | ఇప్పుడు సౌత్ పరిశ్రమ నుండి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కాంతార చాప్టర్ 1. కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఈ మూవీకి ప్రీక్వెల్ తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. చిత్రానికి సంబంధించిన ప్రీక్వెల్‌ను మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇటీవల రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘కాంతార చాప్టర్ 1’ నుంచి మేకర్స్ ఓ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచం తో యుద్ధం చేస్తున్న రిషబ్ శెట్టి పోస్టర్లో కనిపించి అలరించాడు. రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.
ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా హొంబాలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మూవీని గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ‘కాంతారా ఛాప్టర్-1’ చిత్రం కోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేశారు. 500 మంది ఫైటర్లు, 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో తీసిన యుద్ధ ఘట్టం భారతీయ సినిమా చరిత్రలోనే ఓ రికార్డని మేకర్స్ తెలియజేశారు. హోంబలే ఫిల్మ్స్ చిత్రాన్ని నిర్మించగా, ఈ చిత్రంకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదల చేశారు. మూడేళ్ల నుండి షూటింగ్ సాగుతుండగా, ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకి పూర్తైంది. ఈ సందర్భంగా వరల్డ్ ఆఫ్ కాంతార పేరిట మేకింగ్ వీడియో విడుదల చేశారు.
కాతార చాప్టర్ 1 మూవీ ఎలా ఉండనుంది? సెట్స్ ఎలా ఉంటాయి అనేది వీడియోలో చూపించారు. తొలి భాగంతో పోలిస్తే ఈ సారి సెట్స్ చాలా గ్రాండియర్‌గా ఉంటాయని వీడియో ద్వారా అర్ధమవుతుంది. నా ఊరు, అక్కడి సంప్రదాయాలని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసానని ,ఇందుకోసం మూడేళ్లపాటు కృషి చేశాం. దాదాపు 250 రోజుల పాటు షూటింగ్ జరిపామని రిషబ్ శెట్టి అన్నారు. ఇక చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో, ఈ మూవీ అక్టోబర్ 2న వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా విడుదలైన వీడియో నెటిజన్స్ ని ెంతగానో ఆకట్టుకుంటుంది.