Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాఫ్టర్ 1 (Kantara: Chapter 1) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే ఇప్పటికే రూ.650 కోట్లను అలవోకగా దాటి బాహుబలి ది బిగినింగ్ రికార్డును బద్దలుకొట్టిన ఈ చిత్రం తాజాగా గదర్ 2 రికార్డును అధిగమించింది. గదర్ 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.700 కోట్ల వసూళ్లను సాధించగా.. ఈ రికార్డును చెరిపివేస్తూ.. కాంతార రూ.717 కోట్లతో దూసుకుపోతుంది. దీంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 చిత్రాల్లో కాంతార 16వ స్థానానికి ఎగబాకింది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో రెండో ప్లేస్ దక్కించుకుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించగా గుల్షన్ దేవయ్య, జయరాజ్ కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలను చూసుకుంటే.!
1. దంగల్ (రూ.1,900–2,200 కోట్లు)
2. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (రూ.1810 కోట్లు)
3. పుష్ప 2: ది రూల్ (రూ.1800 కోట్లు)
4. ఆర్ఆర్ఆర్ (రూ.1300 కోట్లు)
5. కెజిఎఫ్: చాప్టర్ 2 (రూ.1250 కోట్లు)
6. జవాన్ (రూ.1148 కోట్లు)
7. పఠాన్ (రూ.1050 కోట్లు)
8. కల్కి 2898ఏడీ (రూ.1050 – రూ.1100 కోట్లు)
9. యానిమల్ (రూ.917 కోట్లు)
10. బజరంగీ భాయిజాన్ (రూ.900 – రూ.967కోట్లు)
11. స్త్రీ 2 (రూ.875కోట్లు)
12. సీక్రెట్ సూపర్‌స్టార్ (రూ.858 – రూ.966 కోట్లు)
13. ఛావా (రూ.809 కోట్లు)
14. పీకే (రూ.769 కోట్లు)
15. రోబో 2.0( (రూ.699 – రూ.800 కోట్లు))
16. కాంతార చాఫ్టర్ 1 (రూ.717 కోట్లు)
17. గదర్ 2 (రూ.609 కోట్లు – రూ.700 కోట్లు)
18. సుల్తాన్ (రూ.623 కోట్లు)
19. సలార్ (రూ.612 కోట్లు – రూ.702 కోట్లు)
20. జైలర్ (రూ.650 కోట్లు)
21 బాహుబలి: ది బిగినింగ్ (రూ.650 కోట్లు)
A divine storm at the box office 💥💥#KantaraChapter1 roars past 717.50 CRORES+ GBOC worldwide in 2 weeks.
Celebrate Deepavali with #BlockbusterKantara running successfully in cinemas near you! ❤️🔥#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara… pic.twitter.com/rd92Dch1mS
— Hombale Films (@hombalefilms) October 17, 2025