Kantara Chapter 1 | రిషబ్‌శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1). ‘కాంతార’ (Kantara)కు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 12 రోజుల్లోనే ఈ చిత్రం రూ.675 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం సాధించిన భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం దీపావళి సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుక అందించింది. ‘కాంతార చాప్టర్ 1’ నుంచి దీపావళి పండుగ సందర్భంగా కొత్త ట్రైలర్ (Kantara Chapter 1 Deepavali Trailer)ను విడుదల చేసింది. కాంతార సినిమాలోని పలు కీలక సన్నివేశాలు, ఉత్కంఠభరిత ఘట్టాలతో రూపొందించిన ఈ కొత్త ట్రైలర్.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విధంగా ఆద్యంతం ఆకట్టుకుంటోంది.