Kanthara 1 | సినీ పరిశ్రమలో ఆస్కార్ అవార్డ్ సాధించడం కోసం మేకర్స్ ఎంతో కృషి చేస్తుంటారు. ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడం ఓ కల. ఈ మధ్య భారతీయ సినిమా గౌరవాన్ని పెంచుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటతో దూసుకెళ్లింది. ఈ ఘనత దక్కించుకున్న తర్వాత సౌత్ మేకర్స్ ఆస్కార్‌ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. సూర్య నటించిన కంగువ టీమ్ కూడా భారీగా కలలుకంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆస్కార్ రేస్‌లో నిలిచే స్థాయిలో ఉంటుందనిపించినా ఆఖరిదాకా ట్రావెల్ చేయలేకపోయింది.
ఇక కాంతార ఫస్ట్ పార్టుతోనే ఆస్కార్ ట్రై చేస్తే బాగుండేది అని హోంబలే సంస్థ అప్పట్లో ఫీల్ అయిన విషయం. కాకపోతే అది కుదరలేదు కాబట్టి కాంతార చాప్టర్ ఒన్ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంతార చాప్టర్ ఒన్ కోసం దాదాపు 500 మంది పనిచేస్తున్నారు. అయితే హోంబలే సంస్థ నిర్మిస్తున్న ‘కాంతార 1’ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు చేరేలా వ్యూహరచన చేస్తున్నట్టు చలువే గౌడ అన్నారు. ఇది కన్నడ చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఒక ముఖ్యమైన అడుగు వేసే ప్రయత్నం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆస్కార్ అవార్డుకు దరఖాస్తు చేయడం, దాని ప్రచార ప్రక్రియల గురించి అవగాహ లేదు. అందుకే వాటిపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తే ఎక్కువ మంది భారతీయ సినీ దర్శక నిర్మాతలు ప్రపంచవ్యాప్తంగా ముద్ర వేసే అవకాశం ఉంది.
అయితే కాంతార 1ని మాత్రం ఆస్కార్‌కి పంపే వ్యూహరచన చేస్తున్నట్టు చలువే గౌడ ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025లో ప్రకటన చేశారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాంతార 1’ అక్టోబర్ 2న విడుదల కానుంది.కాంతార చిత్రంతో బాక్సాఫీస్‌ని షేక్ చేసి ఆ తర్వాత ఆస్కార్‌పై గురి పెట్టాలనేది టీమ్ ప్లాన్‌గా అర్ధమవుతుంది.