Kannappa | మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చారిత్రక చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్రతారలు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.తిన్నడుగా విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్ నటించారు. ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచింది. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం వలన ఈ వేడుకను వాయిదా వేశారు. అయితే తాజాగా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ కంటే ట్రైలర్ తోనే మరింత అంచనాలు పెంచేశారు మేకర్స్.
శివ భక్తుడైన కన్నప్ప జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో తీర్చిదిద్దుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.సినిమా విడుదలకు ముందే, ట్రైలర్ ద్వారా సినిమాలోని కీలక ఘట్టాలను, విజువల్ గ్రాండియర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. భక్తి, త్యాగం ప్రధాన అంశాలుగా సాగే ఈ పౌరాణిక కావ్యం, ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.