Manchu Vishnu | మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాను మొదటగా ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మళ్లీ ప్రకటించారు మేకర్స్.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బుధవారం కలిసిన కన్నప్ప టీం.. యోగి చేతుల మీదుగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం సీఎం యోగి మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Met one of my favorite Hero Sri. @myogiadityanath ji. He was gracious to launch the date announcement poster of #Kannappa. Gifted him a painting of Ramesh Gorijala. Such a Humble and powerful aura he has.
Kannappa on June 27th. #HarHarMahadev pic.twitter.com/8zBF2nZ828
— Vishnu Manchu (@iVishnuManchu) April 9, 2025