Kannappa OTT | కథానాయకుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మించగా.. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మోహన్‌బాబు మహదేవశాస్త్రిగా ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించారు.
కథ విషయానికి వస్తే.. బోయవాడైన తిన్నడు(మంచు విష్ణు)కి చిన్నప్పట్నుంచీ దేవుడంటే గిట్టదు. మూఢ విశ్వాసాలను తిన్నడు అస్సలు ఉపేక్షించడు. మహావీరుడుగా పెరుగుతాడు. స్వశక్తినే నమ్ముతాడు. ఒకానొక సందర్భంలో గూడెం పెద్దల నిర్ణయాన్ని తిన్నడు ప్రశ్నిస్తాడు. దాంతో గూడెం నుంచి తిన్నడు బహిష్కరించబడతాడు. తిన్నడిని మనసారా ప్రేమించిన నెమలి(ప్రీతి ముకుందన్) కూడా అయినవారందర్నీ వదిలి తిన్నడిని అనుసరిస్తుంది. శివభక్తురాలైన నెమలికి అడవిలో ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న పంచభూత్మాకమైన వాయులింగాన్ని చూడాలని కోరిక. ఎప్పుడూ నిరంతరం శివధ్యానంలోనే ఉంటుంది తను. నెమలి అలా నిత్యం శివధ్యానంలో ఉండటం తిన్నడికి నచ్చదు. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న ఆ వాయులింగాన్ని మహదేవశాస్త్రి పరులకంట పడనీయకుండా రహస్యంగా పూజిస్తుంటాడు. సృష్టిస్థితిలయ కారుడైన ఈశ్వరుడి ప్రతిరూపమైన ఆ వాయులింగం తనకు మాత్రమే సొంతం అనేలా ప్రవర్తిస్తుంటాడు మహదేవశాస్త్రి. ఓ మహాశివరాత్రి పర్వదినాన భార్య నెమలితో గొడవ పడ్డ తిన్నడు, వేటకని అడవికి బయలుదేరతాడు. కానీ శివాజ్ఞ లేకపోవడంతో అతనికి వేట దొరకదు. ఆ తర్వాత ఓ అద్భుతం జరుగుతుంది. ఏమిటా అద్భుతం? తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు? ఈశ్వరుడు వాయులింగంగా ప్రపంచానికి ఎలా సాక్షాత్కరించాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
Glory ✨ Guts 🔥 Grandeur 🏹 all in one epic#KannappaOnPrime, Watch Now: https://t.co/xdkdIDqKTD@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar @MsKajalAggarwal @arpitranka_30 @mukeshvachan @StephenDevassy @editoranthony @PDdancing… pic.twitter.com/Yp3ClxEyTT
— prime video IN (@PrimeVideoIN) September 4, 2025