Prabhas | మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి క్షేత్ర పురాణం ఆధారంగా రూపొందుతోన్న ఈ భక్తిరసాత్మక చిత్రంలో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర ఏంటి? అనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఆయన ఈ సినిమాలో శివుడిగా నటిస్తున్నాడనే వార్త అయితే బలంగానే వినిపించింది. అయితే.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఇందులో శివుడిగా నటించడంలేదట.
ఇందులో ఆయన నందీశ్వరుడిగా కనిపించనున్నాడని తెలుస్తున్నది. కథలో నందీశ్వరుడిది సీక్వెన్స్ కీలకం కావడంతో ప్రభాస్‌ని ఒప్పించి, ఆ పాత్రను చేయించారట. ఇందులో శివుడిగా అక్షయ్‌కుమార్ నటిస్తున్నట్టు లేటస్ట్ న్యూస్. మోహన్‌లాల్, మోహన్‌బాబు, శివరాజ్‌కుమార్, నయనతార, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే న్యూజిలాండ్‌లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘కల్కి’ షూటింగ్ హడావిడి అయిన వెంటనే ప్రభాస్ ‘కన్నప్ప’ కాల్షీట్స్ ఇస్తారట.