మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం నుంచి ప్రతి సోమవారం ఓ అప్డేట్ను విడుదల చేస్తున్నారు. ఈ పాన్ఇండియా చిత్రంలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్న విషయం తెలిసిందే. సోమవారం ఈ సినిమా నుంచి దేవరాజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆయన ఓ తెగకు చెందిన నాయకుడి పాత్రలో కనిపిస్తారని, కథాగమయంలో ఆయన క్యారెక్టర్ కీలకంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. శివుడి అపరభక్తుడైన కన్నప్ప ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.