Kannappa Movie Akshay Kumar First Look | ఫ్యామిలీ గొడవలతో సతమవుతున్న మంచు ఫ్యామిలీ.. మరోవైపు తమ కలల ప్రాజెక్ట్ కన్నప్పను పూర్తి చేసే పనిలో పడింది. మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నాడు.
హిస్టారికల్ కం మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు పలువురు అగ్ర కథానాయకుల ఫస్ట్ లుక్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పరమేశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు అంటూ అక్షయ్ శివుడి రూపంలో ఉన్న అక్షయ్ ఫస్ట్ లుక్‌ని పంచుకుంది.
ॐ The Eternal Protector ॐ
Unveiling @akshaykumar as *𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚’🔱, a captivating presence of divinity, power, and serenity in #Kannappa🏹.✨
Dive into the ageless story of unwavering love, devotion, and sacrifice.
Experience the grandeur on the big screen this April… pic.twitter.com/CQlB89EaDQ
— Kannappa The Movie (@kannappamovie) January 20, 2025