కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర సతీమణి ప్రియాంక నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’. లోహిత్. హెచ్ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇప్పటివరకు ఎవరూ చేయనటువంటి సరికొత్త ప్రయోగమిది.
సినిమా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్లుగా అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్టమొదటి సినిమా ఇదే. ఈ సరికొత్త ప్రయోగం ప్రేక్షకులను మెప్పిస్తుంది. 30రోజుల పాటు గోవాలో చిత్రీకరణ జరిపాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు