‘జైలర్’ సినిమాలో తక్కువ నిడివి గల పాత్ర చేసినా.. ఎక్కువ ఇంపాక్ట్ చూపించారు కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్. అంతకు ముందు బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో కూడా ఓ ప్రత్యేక గీతంలో మెరిశారాయన. త్వరలో మరో ప్రతిష్టాత్మక తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్ర చేసేందుకు శివన్న సైన్ చేశారు. ఆ సినిమా ఏదో కాదు.
రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందనున్న ‘ఆర్సీ 16’. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శివరాజ్‌కుమార్ స్పెషల్రోల్ చేయనున్నారు. ఈ రోజు శివరాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. ఇద్దరు స్టార్లతో సినిమా చేయడం పట్ల మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, సమర్పణ: మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.