Mark Movie | ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో ‘మార్క్’ (MARK) సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా సాధిస్తున్న భారీ విజయంలో హీరోయిన్ దీప్శిఖ చంద్రన్ పోషించిన పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది.
ప్రేక్షకుల మనసు గెలిచిన దీప్శిఖ
సినిమా చూసిన ప్రేక్షకులు దీప్శిఖ చంద్రన్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటన చూసి థియేటర్లలో ఈలలు, చప్పట్లతో హోరెత్తిస్తున్నారు. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ల ప్రాధాన్యత తక్కువగా ఉంటుందనే వాదనను చెరిపివేస్తూ, దీప్శిఖ తన నటనతో సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచారు. ఈ సినిమాలో దీప్శిఖ చేసిన యాక్షన్ బ్లాక్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, రిస్కీ స్టంట్స్ మరియు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మెప్పించడంతో సోషల్ మీడియాలో ఆమెను “మార్క్ క్వీన్”, “క్వీన్ ఆఫ్ మార్క్” అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు.
పాజిటివ్ మౌత్ టాక్‌తో కన్నడ మార్కెట్లో ‘మార్క్’ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన విజయం దీప్శిఖ చంద్రన్ కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోనుంది. ఆమెకు పెరుగుతున్న ఈ ఆదరణను చూస్తుంటే, రానున్న రోజుల్లో ఆమె మరిన్ని భారీ ప్రాజెక్టులలో కనిపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘మార్క్’ సినిమాతో దీప్శిఖ చంద్రన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని కన్నడ ప్రేక్షకులకు కొత్త క్రష్‌గా మారిపోయారు.