Dr. Shiva Rajkumar | కన్నడ చక్రవర్తి, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన అభిమానులకు శుభవార్త తెలిపాడు. క్యాన్సర్ వ్యాధి నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించాడు. కొత్త సంవత్సరం కానుకగా ఈ విషయం మీతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ శివరాజ్ కుమార్ వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా శివరాజ్ కుమార్ క్యాన్సర్తో పోరాడుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఆపరేషన్ ఆనంతరం శివరాజ్ కుమార్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అతడి భార్య గీత శివరాజ్ కుమార్ వెల్లడించింది.
అందరికీ నమస్కారం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రార్థనలు నిజమయ్యాయి. శివరాజ్ కుమార్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు. త్వరలోనే కర్ణాటకకు తిరిగొస్తామని అమె పేర్కొంది. శివరాజ్ కుమార్ స్పందిస్తూ.. నా క్యాన్సర్ చికిత్స చివరి దశకు చేరుకుంది… త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ శివరాజ్ కుమార్ తెలిపారు. క్యాన్సర్ సోకిందని తెలిసిన తర్వాత ఎవరైనా భయపడతారని… అయితే, ఆ భయం నుంచి బయటపడేందుకు తన భార్య గీత, తన అభిమానులు ఎంతో సహకరించారని చెప్పారు.
ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ, ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ನಾನು ಚಿರಋಣಿ
ಹೊಸ ವರ್ಷದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು! #2025 pic.twitter.com/4oyg2uXfjg— DrShivaRajkumar (@NimmaShivanna) January 1, 2025
Also Read..