MS Dhoni : సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. విదేశాల్లో కొందరు, స్వదేశంలోని పర్యాటక ప్రాంతాల్లో మరికొందరు, ఇళ్ల దగ్గరే ఇంకొందరు కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఈసారి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ (New Year celebrations) గోవా (Goa) లో చేసుకున్నారు.
ధోనీ తన కుటుంబసభ్యులు, దగ్గర బంధువులు, మిత్రులతో కలిసి గోవాలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అందులో ధోనీ తన భార్య సాక్షితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్గా మారింది. ధోనీ గోవా బీచ్లో పార్టీ చేసుకుంటూ, భార్యతో కలిసి స్టెప్పులేయడాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. గోవాలో మోర్జిమ్ బీచ్లో జరిగిన వేడుకల్లో ధోనీ పాల్గొన్నారు.
Cutest Video of the day ♥️
Mahi Sakshi 😍#MSDhoni pic.twitter.com/3qa3hE4VEw
— Chakri Dhoni (@ChakriDhonii) January 1, 2025