Kanguva – KE Gnanvel Raaja | తమిళ అగ్ర కథానాయకుడు సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సిరుత్తై శివ (siva) దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తగ్గాయి.
అయితే ఈ సినిమాకు వచ్చిన నష్టాల వలన హీరో సూర్య కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. స్టూడియో గ్రీన్(Studio Green) అధినేత ఈ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌కి జరిగిన నష్టానికి సూర్య తన వంతుగా ఈ ప్రోడక్షన్లో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కూడా తక్కువ బడ్జెట్‌తో నిర్మించబోతుండగా.. దీనికోసం సూర్య రెమ్యూనరేషన్ తీసుకోట్లేదని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.