Kanguva | తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో శనివారం ఎపిసోడ్లో నాగార్జునతో కలిసి పాల్గోన్నాడు. అయితే ఈ షోలో సూర్యను చూసి ఇంత చక్కగా మాట్లాడుతున్నావు తెలుగు అని అనగా.. సూర్య మాట్లాడుతూ.. సర్ నాకు కొంచెం మాత్రమే వచ్చు. నేను పూర్తిగా మాట్లాడలేను. ఈ విషయంలో నాకు కార్తీని చూస్తే నిజంగా ఈర్ష్య, అసూయ కలుగుతుంది. వాడు ఎంత మంచిగా తెలుగు మాట్లాడుతాడు అని. అతడు తమిళనాడులో ఉన్నవారితో కూడా తెలుగులో మాట్లాడుతాడు. తెలుగులో పాటలు కూడా పాడతాడు. అతడికి సినిమా అంటే ప్రాణం అంటూ సూర్య చెప్పుకోచ్చాడు.
#Nagarjuna asking #Suriya to speak in Telugu !!
Suriya: Not fully loaded edition, I’m a Limited Edition😁❣️. I’m really jealous & greedy about Karthi, the way he speaks Telugu🤞. Karthi is a First Bench student & I’m the last bencher😂
pic.twitter.com/WuCWDgrN0X— AmuthaBharathi (@CinemaWithAB) October 27, 2024