Shraddha Das | నటి శ్రద్ధాదాస్ గాయనిగా అవతారం ఎత్తారు. సూర్య నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’లో ఆమె ఓ పెప్పీ సాంగ్‌ని ఆలపించారు. ‘హోల్డ్ మీ.. హగ్ మీ.. కిస్ మీ.. కిల్ మీ..’ అంటూ సాగిన ఈ పాటను రాకేందుమౌళి రాయగా, దేవిశ్రీప్రసాద్ స్వరపరిచారు. సాగర్, దేవిశ్రీలతో కలిసి శ్రద్ధాదాస్ ఆలపించారు.
సూర్య, దిశా పటాని, బాబీడియోల్పై ఈ పాటను చిత్రీకరించారు. విడుదలైన కాసేపటికే ఈ పాట మిలియన్ల వ్యూస్ సాధించిందని, దేవిశ్రీ, శ్రద్ధాదాస్, సాగర్ల గాత్రం ఈ పాటకు ఆకర్షణగా నిలిచాయని మేకర్స్ తెలిపారు. శివ దర్శకత్వంలో కె.ఈ.జ్ఞానవేల్‌రాజా, వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే.