Kanguva | తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ రోజునే తమిళంలో మరో పెద్ద సినిమా రాబోతుంది. ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’( Vettayan). తెలుగులో వేటగాడు (Vetagadu) అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయితే బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవ్వడంతో పాటు కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశముందని కంగువ టీం అలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ సినిమా విడుదల తేదీని అక్టోబర్ నుంచి నవంబర్‌కు షిప్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు హీరో సూర్య కూడా.. రజినీకి గౌరవం ఇచ్చి తన సినిమాని వాయిదా వేస్తున్నట్లుగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. కాగా ఈ వార్తలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.