Kangana Vs Nausheen | బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌పై పాక్ నటి నౌషీన్ షా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతుందని మండిపడింది. చెంపదెబ్బలు కొట్టేందుకు కంగనను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఆమెకు ఇతర వ్యక్తుల గౌరవం లేదని.. నటన, వివాదాలు, మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌పై దృష్టి పెట్టాలంటూ హితవు పలికింది. ‘మోమిన్ సాకిబ్‌తో హద్ కర్ ది షో’లో పాల్గొన్న నౌషీన్‌ను బాలీవుడ్ తారలను ఎవరినైనా కలవాలనుకుంటున్నారా? అన్ని ప్రశ్నించగా.. కంగనా పేరు చెప్పి.. ఆమెను చెంపదెబ్బలు కొట్టాలనుకుంటున్నట్లు పేర్కొంది.
ఇంకా మాట్లాడుతూ ‘ఆమె నా దేశం గురించి మాట్లాడే విధానం, పాకిస్తాన్ సైన్యం గురించి ఆమె చాలా చెత్తగా చెప్పే విధానానికి, ఆమె ధైర్యానికి నమస్కరిస్తున్నాను. ఆమెకు జ్ఞానం లేదు. మరో దేశం గురించి మాట్లాడుతుంది. మీ సొంత దేశం, నటన, వివాదాలు, మాజీ బాయ్ఫ్రెండ్స్లపై దృష్టి పెట్టండి’ అంటూ సూచించింది. ప్రస్తుతం నౌషీన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, కంగనా అభిమానులు నౌషీన్పై మండిపడుతున్నారు.