Kangana| సాధారణంగా ఎవరైన కింద పడిపోతే అయ్యో పాపం అంటాం, ఏదైన గాయం అయితే ఓదార్చే ప్రయత్నం చేస్తాం. కాని బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కంగనా శర్మ కింద పడిపోతే అయ్యో పాపం అనకుండా ఆమెని తిట్టిపోస్తున్నారు. మరి ఆ అందాల ముద్దుగుమ్మని అలా తిట్టిపోయడం వెనక కారణం లేకపోలేదు. సాధారణంగా బాలీవుడ్ భామలు ఎంత లగ్జరీయస్‌గా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు ధరించే దుస్తులు, వేసుకునే షూస్ అన్ని కూడా చాలా రిచ్‌గా ఉంటాయి. అయితే స్టైల్ కోసం చూసుకునే కొందరు లేనిపోని చిక్కుల్లో పడిపోతుంటారు.
తాజాగా కంగనా శర్మ తాను ధరించిన హై హీల్డ్ చెప్పులు వలన లేని పోని సమస్యలు తెచ్చుకుంది. మోడల్ కంగనా శర్మ ఇటీవల ముంబైలోని ఒక హోటల్ నుండి బయటకు వచ్చింది. ఆమె నల్లటి బాడీకాన్ డ్రెస్ ధరించిం, హై హీల్డ్ చెప్పులతో హోటల్ బయట ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. ఆ తరువాత కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ పోజు ఇచ్చింది.ఇక అదే సమయంలో తన చెప్పులు కారణంగా బ్యాలెన్స్ కోల్పోయిన ఆమె మెట్లపై నుండి పడింది. వెంటనే తేరుకున్న కంగనా మళ్ళీ లేచి నిలబడి ఫోటోగ్రాఫర్ కు పోజు ఇచ్చింది.
కంగనా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె వీడియోపై చాలా మంది కామెంట్లు చేశారు. కంగనా డ్రెస్ మినీ-కిని లాంటిదని, కాబట్టి ఆమె ఊప్స్ మూమెంట్ బాధితురాలు కాదని నెటిజన్లు అంటున్నారు. కంగనా ఎప్పుడు కూడా తన బోల్డ్ లుక్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో తన పోస్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ చిత్రంలో నటించడం ద్వారా నటించడం ప్రారంభించింది. ఇక ‘ది కపిల్ శర్మ షో’, ‘తు సూరజ్ మై సాంజ్ పియాజీ’ వంటి షోలలో నటించి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.