Kangana Ranaut | ప్రముఖ నటి, లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ 2025లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని పారాలంపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (PCI) అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్న ఈ ఛాంపియన్షిప్ పోటిలలో వందకు పైగా దేశాల నుంచి పారా అథ్లెట్లు హాజరుకానున్నారు.
ఈ ఎంపికపై కంగనా స్పందిస్తూ.. ఈ అవకాశం లభించినందుకు తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, పారా అథ్లెట్ల అద్భుత విజయాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి కృషి చేస్తానని కంగనా రనౌత్ తెలిపారు. పారా స్పోర్ట్ అనేది కేవలం పోటీ మాత్రమే కాదని, అది ధైర్యం మరియు సంకల్పానికి ప్రతీక అని ఆమె అన్నారు.