బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Apr 21, 2020 , 23:09:12

తలైవి ఔదార్యం

తలైవి ఔదార్యం

కరోనా విలయతాండవం కారణంగా సినీ పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుతోంది.ముఖ్యంగా చిత్రసీమలో పనిచేసే దినసరి కార్మికులు ఉపాధిని కోల్పోయి బాధల్ని అనుభవిస్తున్నారు. కష్టాల్ని  ఎదుర్కొంటున్న సినీ కార్మికుల్ని ఆదుకుంటూ అగ్రనాయకనాయికలు తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం  బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ దక్షిణ భారత ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌కు ఐదు లక్షల్ని విరాళంగా అందజేసింది. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావంతో షూటింగ్‌ వాయిదా పడింది. ఈ సినిమా కోసం పనిచేస్తున్న దినసరి కార్మికులకు మరో ఐదు లక్షల్ని అందించి సహృదయతను చాటుకున్నది. గతంలో ప్రధాన మంత్రి సహాయనిధికి ఇరవై ఐదు లక్షల్ని అందించింది కంగనా రనౌత్‌. 


logo