Kamal Haasan | యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానితో పాటుగా ఫాహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.లేటెస్ట్గా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీను మార్చి 14 ఉదయం 7 గంటల సమయానికి వెల్లడిస్తామని మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో కమల్‌హాసన్ చేతిలో కత్తి పట్టుకొని ఇంటెన్సీవ్ లుక్స్‌తో అదిరిపోయాడు. పోస్టర్ డిజైన్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
#VIKRAM theatrical release date to be announced on March 14th,2022 at 7AM#VikramReleaseAnnouncement @ikamalhaasan @Dir_Lokesh #FahadhFaasil #Mahendran @anirudhofficial @RKFI @turmericmediaTM @SonyMusicSouth @APIfilms pic.twitter.com/ugcalT6ORG
— VijaySethupathi (@VijaySethuOffl) March 11, 2022