KH233 | వలిమై, తునివు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ హెచ్ వినోథ్ (H Vinoth). సమాజాన్ని ఆలోచింపజేసే సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటారు లోకనాయకుడు కమల్ హాసన్ (kamalhaasan), డైరెక్టర్ హెచ్ వినోథ్. ఇప్పుడీ ఇద్దరు సెలబ్రిటీలు ఓ సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నారు. ఈ స్టార్ డైరెక్టర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఇవాళ నెల్ జయరామన్ ట్రెడిషనల్ రైస్ కన్జర్వేషన్ సెంటర్ కమిటీ సభ్యులతో కమల్‌హాసన్‌తోపాటు డైరెక్టర్ హెచ్ వినోథ్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది హెచ్ వినోథ్ టీం. కమల్ హాసన్ తన KH233 ప్రాజెక్ట్‌ను హెచ్ వినోథ్ డైరెక్షన్లో చేయబోతున్నాడు. హోం బ్యానర్ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కించనున్నాడు.
సామాజిక కథాంశంతో అందరినీ ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉండబోతుందని ప్రకటించింది హెచ్ వినోథ్ టీం. మీతో పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.. అని ట్వీట్ చేశాడు హెచ్ వినోథ్. కమల్ హాసన్ ఇప్పటికే లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో KH234 ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో దాదాపు ఫైనల్ అయినట్టు సమాచారం.
Director H. Vinoth and Ulaganayagan Kamal Haasan meeting along with the committee members of Nel Jayaraman Traditional Rice Conservation Center.
Two socially responsible citizens Ulaganayagan Kamal Haasan and Director H.Vinoth join hands together for an upcoming project #KH233… pic.twitter.com/shoKFCikQn
— Ramesh Bala (@rameshlaus) June 12, 2023