కమల్‌హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ సినిమాలోని ‘పతళ పతళ’ అనే తొలి గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలో కమల్‌హాసన్ తనదైన శైలి స్టెప్పులతో అలరించారు. ఈ గీతానికి కమల్‌హాసన్ సాహిత్యాన్నందించడంతో పాటు స్వయంగా ఆలపించారు.
ఈ నెల 16న చెన్నైలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా, ఫహద్ ఫాజిల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్‌దాస్, శివాని నారాయణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్, నిర్మాతలు: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, దర్శకత్వం: లోకేష్ కనకరాజ్.