Kamal Hassan | లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కమల్ హాసన్ చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం సృష్టించాయి. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కమల్ హాసన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలను అడ్డుకుంటామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. హైకోర్ట్ కూడా కమల్ని క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. తప్పులకు మాత్రమే క్షమాపణలు చెబుతారు, అపార్థాలకు కాదు అని కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
అలానే ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేయనని కమల్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం ‘థగ్ లైఫ్’ సినిమాకు రూ. 12 నుంచి రూ. 15 కోట్ల ఆర్థిక నష్టం రావొచ్చు. అయిన కూడా ఏ మాత్రం తన నిర్ణయంలో కమల్ మార్పు చేయలేదు. అయితే కన్నడ నుండి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అయిన తమిళంలో మత్రం ఆయనకి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇదిలా ఉంటే కమల్ హాసన్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాను బాలీవుడ్ వదిలేయడానికి అవకాశాలు లేకనో, ఇచ్చేవాళ్లు లేకనో కాదు. అక్కడి వారికి చాలా అండర్ వరల్డ్ కనెక్షన్లు ఉన్నాయి. మాఫియా ఒత్తిడులని వ్యతిరేకించడానికి లేదా బెదిరింపులకు లొంగిపోవడానికి అక్కడ ఉండదలచుకోలేదని కమల్ అన్నారు.
మాఫియా సంబంధాలు, నల్లధనంతో నేను ఎలాంటి సంబంధం పెట్టుకోలదలుచుకోలేదు. అవినీతి లేకుండా ఒక నటుడిని పెద్ద స్టార్ గా చేయడం సాధ్యమే అవుతుంది. అందుకు నేను ప్రత్యక్ష ఉదాహరణ. నల్లధనాన్ని నేనెప్పుడూ ముట్టుకోలేదు. నల్లధనాన్ని మీ వద్ద ఉంచుకోవద్దని ప్రభుత్వాలు బెదిరించడానికి ముందు ఇది చాలా కాలం కొనసాగింది. నేను – నా సోదరుడు అలాంటి బెదిరింపులను రిసీవ్ చేసుకున్నాము.. అని కమల్ తెలిపారు.