కమల్‌హాసన్ కథానాయకుడిగా లోకేష్‌కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఆర్.మహేంద్రన్, కమల్‌హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రధారులు. తాజాగా సెకండ్ షెడ్యూల్ పూర్తయినట్లు ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. కమల్‌హాసన్ బైక్‌పై కూర్చొని ఉన్న వర్కింగ్ స్టిల్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. విక్రమ్ ఎవరు? పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అతడు గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. కమల్‌హాసన్ పాత్ర శక్తివంతంగా సాగుతుంది. సెకండ్ షెడ్యూల్లో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌పై కీలక ఘట్టాలను చిత్రీకరించాం’ అని తెలిపారు. కాళీదాస్ జయరాం, నరైన్, అర్జున్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్.