మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి Malaikottai Valiban టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. కాగా ఈ మూవీ సెట్స్ కు వెళ్లే కంటే ముందే ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan)కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడట.
ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర కోసం కమల్ హాసన్‌ను సంప్రదించారని, అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే మోహన్ లాల్-కమల్ హాసన్ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుండటం ఖాయమైనట్టేనని జోరుగా ఇండస్ట్రీ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ క్రేజీ అప్డేట్ పై రానున్నరోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. తమిళంలో తెరకెక్కిన ఉన్నైపోల్ ఒరువన్ సినిమాలో కమల్, మోహన్ లాల్ కలిసి నటించారు. ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్- కమల్‌హాసన్ కాంబినేషన్లో ఈనాడు టైటిల్‌తో తెరకెక్కింది.