Indian-2 Movie | తమిళం నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇండియన్-2 ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు ఎలా నడుం బిగించాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శంకర్ డైరెక్షన్, కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. ఇక ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది.
మొదటగా సంక్రాంతిని టార్గెట్ పెట్టుకున్నా.. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో విడుదల మరోసారి వాయిదా పడే చాన్స్ ఉంది. కాగా మంగళవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి కమల్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఖాకీ చొక్కా వేసుకుని నిల్చున్న కమల్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా కోసం శంకర్ బాగానే కసరత్తులు చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అనే రేంజ్లో ఫైట్స్ డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాను రెడ్ జియాంట్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
#INDIAN2 pic.twitter.com/rhStm6ISLD
— Shankar Shanmugham (@shankarshanmugh) August 15, 2023