కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. శంకర్ డైరెక్షన్లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఇండియన్ 2 (Indian 2)కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తాజా షెడ్యూల్ షూటింగ్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఇండియన్ 2 చిత్రీకరణ తిరుపతితోపాటు పరిసర ప్రాంతాల్లో జరుగనుంది. మేకర్స్ ఏప్రిల్ చివరి నాటికి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయనున్నారని ఇన్ సైడ్ టాక్.
ఈ చిత్రంలో కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్న ఇండియన్ 2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. శంకర్ మరోవైపు రాంచరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 షూటింగ్‌తో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు.
కమల్ హాసన్ మరోవైపు మణిరత్నం డైరెక్షన్లో 234వ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, కమల్ హాసన్ హోం బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రైటర్ జయమోహన్ కూడా కమల్ హాసన్ టీంలో జాయిన్ అయ్యారు. ఈ చిత్రానికి జయమోహన్ డైలాగ్స్ అందిస్తుండటంతోపాటు మణిరత్నంతో కలిసి స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నారు.