మణిరత్నం దర్శకత్వంలో తాను నటిస్తున్న ‘థగ్‌లైఫ్’ సినిమా గురించి అగ్ర నటుడు కమల్‌హాసన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘నాయగన్’ వంటి కల్ట్‌క్లాసిక్ చిత్రాన్ని అందించిన ఈ ద్వయం 37 ఏండ్ల విరామం తర్వాత ‘థగ్‌లైఫ్’తో ప్రేక్షకుల ముందుకురాబోతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు కమల్‌హాసన్. ఈ చిత్రం ద్వారా మణిరత్నం మల్టీస్టారర్‌కు అసలైన నిర్వచనాన్ని అందించబోతున్నారని చెప్పారు. దక్షిణ, ఉత్తర భారతానికి చెందిన ప్రతిభావంతులైన నటీనటుల కలయికలో అద్భుతమైన కంటెంట్‌తో ఈ సినిమా రూపొందుతున్నదని తెలిపారు. “థగ్‌లైఫ్’ నిస్సందేహంగా గ్రేట్ మల్టీస్టారర్ అవుతుంది. ఇందులో నటించేవారు తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకుంటారు. ఎందరో యువనటులు ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది. సినిమాలోని ప్రతీ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఓ గొప్ప చిత్రాన్ని చూడబోతున్నారు’ అని కమల్‌హాసన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో శింబు, త్రిష, నాజర్, జోజూజార్జ్, అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.