kamal haasan | ఇటీవలే డీఎంకే ఎంపీ కనిమొళికి ట్రావెల్ టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన వివాదంలో మహిళా బస్ డ్రైవర్ షర్మిల (Sharmila)ను ట్రావెల్స్ మేనేజ్మెంట్ ఉద్యోగం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఉద్యోగం కోల్పోయిన షర్మిలను తన కార్యాలయానికి ఆహ్వానించారు ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ (kamal haasan). షర్మిలకు కారు బహుమతిగా అందజేశారు. షర్మిల కేవలం డ్రైవర్‌గా ఉండిపోకుండా.. కమల్ కల్చరల్ సెంటర్ ద్వారా డ్రైవర్-ఎంట్రెప్రెన్యూర్‌గా మారి ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ముందుకెళ్లాలని కమల్ హాసన్ ఆకాంక్షించారు.
‘ఇటీవల షర్మిల చుట్టూ జరిగిన చర్చ పట్ల ఎంతో వేదన చెందాను. షర్మిల కేవలం డ్రైవర్‌గానే మిగిలిపోవద్దు. ఎంతోమంది షర్మిలలను తయారు చేస్తుందన్న నమ్మకముంది. షర్మిలకు కారు బహుమతిగా అందజేశాం. ఆమె ఇప్పుడు కారును రెంటల్ సర్వీస్ కోసం వినియోగించుకుని, మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదగాలని’ కమల్ హాసన్ సూచించారు.
ఎంపీ కనిమొళి కోవై పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని గాంధీపురం నుంచి పీలమేడుకు బస్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా సిటీ తొలి మహిళా బస్ డ్రైవర్ షర్మిలను ప్రశంసించి.. ఆమెకు వాచ్‌ను గిఫ్ట్‌గా అందజేశారు. అయితే అదే బస్‌లో ఉన్న మహిళా ట్రైనీ కండక్టర్ ఎంపీ కనిమొళి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ షర్మిల ట్రావెల్స్ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. అయితే బస్‌లో తరచూ సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ.. ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని షర్మిలపై కండక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో షర్మిలను ఉద్యోగంలో నుంచి తొలగించింది ట్రావెల్స్ మేనేజ్మెంట్.
Coimbatore’s first woman bus driver #Sharmila who quit her job after a controversy erupted over issuing of bus ticket to DMK MP Kanimozhi, has now been presented a new car by MNM leader #KamalHaasan to continue her journey as an entrepreneur. @IndianExpress pic.twitter.com/SyMS059KvS
— Janardhan Koushik (@koushiktweets) June 26, 2023